![]() |
![]() |
.webp)
ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇక ఈ ఎపిసోడ్ ని కిట్టి పార్టీగా తీసుకురాబోతోంది. ఈ ఎపిసోడ్ కి చక్రవాకం సీరియల్ హీరోయిన్ ప్రీతి అమీన్, ఋతురాగాలు శృతి, నటకుమారి, అమూల్య గౌడ వంటి వాళ్లంతా వచ్చారు. "బేసిక్ గా కిట్టి పార్టీలో రకరకాల గేమ్స్ ఆడుతూ ఉంటారు. మీకు ఏ గేమ్ ఇష్టం" అని అడిగింది హోస్ట్ శ్రీముఖి. "నాకు ఏ గేమ్ ఐనా గెలవడం ఇష్టం. అందుకే నేను ఈ హ్యాండ్ బ్యాగ్ తెచ్చాను" అని చెప్పింది ప్రీతీ...ఇక శృతి బ్యాగ్ చూసి శ్రీముఖి షాక్ అయ్యింది. "అమ్మో శృతి అక్క చూడు ఎంత పెద్ద బ్యాగ్ తెచ్చిందో" అనేసింది. గెలిస్తే వచ్చే డబ్బులు తీసుకెళ్లడానికి వీళ్ళు ఇంత పెద్ద బ్యాగ్ లు తెచ్చారు అన్నాడు హరి.
తర్వాత శ్రీముఖి నటకుమారి దగ్గరకు వెళ్లి "ఎప్పుడైనా రియల్ లైఫ్ లో కిట్టి పార్టీకి వెళ్ళావా" అని అడిగింది శ్రీముఖి.."వెళ్ళలేదు ఎందుకంటే నన్ను ఎవరూ పిలవలేదు" అని చెప్పింది శ్రీముఖి. ఇక అమూల్య గౌడ దగ్గరకు వచ్చి "సీరియల్ లో ఎలా ఉంటావు మీనా...చీర కట్టుకుని పూలు అమ్ముకుని పిచ్చిదానిలా ఉంటావ్...ఇక్కడ చూడు ఎలా ఉన్నావో" అంది శ్రీముఖి. దాంతో అమూల్య బ్లాక్ డ్రెస్ బ్లాక్ గాగుల్స్ తో రాంప్ వాక్ చేసింది. తర్వాత భానుమతి దగ్గరకు వెళ్ళింది శ్రీముఖి "ఈవిడ కోసం కిట్టి పార్టీ ఏంటీ సొంతంగా పార్టీ కూడా పెట్టొచ్చు.. అంత అందంగా ఉన్నారు. మీ నాన్నగారికి ఏమన్నా పళ్ళ తోట ఉందా..అందుకేనా బుగ్గలు యాపిల్ పళ్ళలా..కళ్ళు ద్రాక్ష పళ్ళలాగా..పెదాలు చెర్రీ పళ్ళలాగా ఉన్నాయి " అని తెగ మోసేసాడు హరి. దాంతో మిగతా వాళ్లంతా ఓ అంటూ కేకలేశారు.
![]() |
![]() |